BREAKING
విద్యార్థులు మత్తు కుబానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచికుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడ పోటీలు:ప్రారంభించిన మండల విద్యాధికారి శంకర్ భారత టెక్‌ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి ఆకాశ్ అంబానీ త్రైమాసిక లాభాల్లో అంచనాలను తలకిందులు చేసిన ఎస్ఎస్‌ఏబీ

‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి :కూన శ్రీశైలం గౌడ్ పిలుపు..

Select Suryaa Now
‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి :కూన శ్రీశైలం గౌడ్ పిలుపు..

జీడిమెట్ల మేజర్ న్యూస్ :నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీపీసీసీ అబ్జర్వర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.

 ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో పాటు రామగుండం, మంథని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 1న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి నాయకులు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఉమ్మడి జిల్లా క్లస్టర్ ఇన్‌చార్జి శరత్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.