BREAKING
కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి

నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ

Select Suryaa Now
నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ

సూర్య కోనరావుపేట:నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారంతో, చెన్నమనేని శ్రీకుమార్ చొరవతో కొలనూరు గ్రామానికి చెందిన మేర్గు అంజి అనే నిరుపేద వికలాంగుడికి స్కూటీని బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ జలగం అరవింద్ రావు మాట్లాడుతూ... ఈ సహాయం  వికలాంగుడి రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడనుందని అన్నారు.పదవిలో ఉన్నా, లేకున్నా గ్రామం, మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా నిలుస్తూ, అవసరమైన వారికి సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలవాలని గ్రామ ప్రజల తరఫున ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ బిట్ల బాబు, ప్యాక్స్ డైరెక్టర్ నూగురి గణేష్,వార్డు సభ్యులు తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, భాను, అగ్రహారం టెంపుల్ మాజీ డైరెక్టర్ తాళ్లపల్లి సతీష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.