నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం
సూర్య కోనరావుపేట:నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారంతో, చెన్నమనేని శ్రీకుమార్ చొరవతో కొలనూరు గ్రామానికి చెందిన మేర్గు అంజి అనే నిరుపేద వికలాంగుడికి స్కూటీని బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ జలగం అరవింద్ రావు మాట్లాడుతూ ఈ సహాయం వికలాంగుడి రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడనుందని అన్నారు.పదవిలో ఉన్నా, లేకున్నా గ్రామం, మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా నిలుస్తూ, అవసరమైన వారికి సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలవాలని గ్రామ ప్రజల తరఫున ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బిట్ల బాబు, ప్యాక్స్ డైరెక్టర్ నూగురి గణేష్,వార్డు సభ్యులు తుమ్మల సురేష్, బోలగం కమలాకర్, భాను, అగ్రహారం టెంపుల్ మాజీ డైరెక్టర్ తాళ్లపల్లి సతీష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.