ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడ పోటీలు:ప్రారంభించిన మండల విద్యాధికారి శంకర్
దుద్యాల్, మేజర్ న్యూస్:
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా దినోత్సవాన్ని మండల విద్యాధికారి శంకర్ బుధవారం నిర్వహించారు. క్రీడా పోటీలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ...క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, శారీరక వికాసం, మానసిక ఉల్లాసం మరియు సామాజిక సమానత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడం విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు సంబంధిత సిబ్బందికి ప్రతేక అవసరాల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం
మల్లప్ప, ఐఈఆర్పీ అధికారులు రామ్ శ్రీనివాస్, చందర్, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.