భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి
ఆత్మకూరు/మేజర్ న్యూస్: భవిష్యత్తు రోజుల్లో మంచి ఉపాధి అవకాశాలు గల వాటిని ఎన్నుకోవాలని వనపర్తి జిల్లా డిఎస్పి గిరిబాబు తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎం వి రామన్ పాఠశాల నందు గ్లోబల్ సైన్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ఇంజనీరింగ్, డాక్టర్లపై శ్రద్ధ చూపుతున్నారని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఉపాధి దొరకపోవడంతో పట్టణాలలో పిచ్చి వారిగా తిరుగుతున్నారని, వైద్యుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్రో అధినేత శ్రీనివాసులు, సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న, ఎంఈఓ శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ గౌడ్, మున్సిపల్ మంచి శ్రీధర్ గౌడ్ ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.