ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జితేందర్ తేజ్వాని ఎన్నిక
చందానగర్,మేజర్ న్యూస్ : ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జితేందర్ తేజ్వాని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ట్రస్మా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ట్రస్మా బలోపేతానికి, విద్యారంగ అభివృద్ధికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన అన్నారు.