సిద్ధిక్ నగర్‌లో పెండింగ్ రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలి… జలమండలి అధికారికి ఆంజనేయులు సాగర్ వినతి
కొండాపూర్,మేజర్ న్యూస్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ కాలనీలో డ్రైనేజీ పైప్‌లైన్ మార్పు పనుల అనంతరం రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు పొంగిపొర్లిన సమయంలో రోడ్డుపై నీరు నిలిచిపోతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను స్థానికులు అంజయ్య నగర్ నాయకులు ఆంజనేయులు సాగర్ దృష్టికి తీసుకెళ్లగా,ఆయన వెంటనే స్పందించారు. ఈ మేరకు సోమవారం జలమండలి మేనేజర్ విక్రమ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను తక్షణమే పూర్తి చేసి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.దీనిపై మేనేజర్ విక్రమ్ రెడ్డి సానుకూలంగా స్పందించి, త్వరలోనే ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్ధిక్ నగర్ కాలనీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సదర్ రాము, రాజేందర్ రెడ్డి, రోహిత్ సాగర్, యాదగిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.