BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

తిరుపతిలో 35 కోట్ల మురుగు రాజకీయం

Select Suryaa Now
తిరుపతిలో 35 కోట్ల మురుగు రాజకీయం

తిరుపతి నగరంలో మురుగు రాజకీయం తారాస్థాయికి చేరింది. రూ. 35 కోట్ల భారీ వ్యయంతో ప్రారంభించాల్సిన అమృత్ (AMRUT) పథకం పనుల్లో రాజకీయ విషం చిందారు. టెండర్లు పూర్తయి వంద రోజులు గడుస్తున్నా, కమిషన్ల (పర్సెంటేజీల) పంచాయితీ కొలిక్కిరాకపోవడంతో వాటిని తెరవడానికి అధికారులు సాహసించడం లేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు మురుగులోనే నానిపోతుండగా, స్థానిక ప్రజలు మాత్రం దుర్వాసనతో తీవ్ర అవాస్థలు పడుతున్నారు.

​కేంద్రం నిధులు మంజూరు చేసినా...

​కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకం-2 లో భాగంగా, మొదటి విడత కింద తిరుపతి-రేణిగుంట పైప్‌లైన్ మార్చడానికి రూ. 35 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. సుమారు 6,500 మీటర్ల మేర కొత్త పైప్‌లైన్ వేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 19న టెండర్లు పిలవగా, జూన్ 19 నాటికి మూడు ప్రముఖ కంపెనీలు టెండర్లను దాఖలు చేశాయి.​బెంగళూరుకు చెందిన 'కేబీఆర్ ఇన్ ఫ్రా' కంపెనీ, తిరుపతి జిల్లాకు చెందిన 'జెఎంసి' (JMC), గుంటూరుకు చెందిన 'రఘురాం హోమ్ పైప్స్' సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన కేబీఆర్ ఇన్ ఫ్రా కంపెనీకి అన్ని అర్హతలు ఉండటమే కాకుండా, నిబంధనలకు అనుగుణంగా అత్యంత తక్కువ ధరకు కోట్ చేయడం విశేషం.

​తేలని పర్సెంటేజీల వ్యాపారం...

​అర్హత కలిగిన సంస్థ తక్కువ కోట్ చేసినప్పటికీ, ఈ పనులు ప్రారంభం కావడానికి మాత్రం 'పర్సెంటేజీల' అడ్డంకి తలనొప్పిగా మారింది. కాంట్రాక్టర్ వర్గాలు అధికారులు డిమాండ్ చేసిన లంచానికి అంగీకరించకపోవడంతో వివాదం ముగియలేదు. దీంతో టెండర్ గడువు ముగిసి వంద రోజులు దాటినా అధికారులు ఆ టెండర్లను తెరిచే సాహసం చేయలేదు. మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి జయకృష్ణకు ఈ వ్యవహారంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, టెండర్లు తెరిపించే విషయంలో ఇంతవరకు ఎలాంటి చొరవ తీసుకోకపోవడం గమనార్హం.​వర్షాకాలం వచ్చిందంటే చాలు, రేణిగుంట రోడ్డు మార్గంలో మురుగునీరు రోడ్లపైకి ఉబికివచ్చి చెరువులను తలపిస్తోంది. ఈ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయం ఫోటో 

​రూ. 35 కోట్ల పనుల ప్రత్యేకత ఏమిటి?

​తిరుపతి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ తీవ్రంగా దెబ్బతినడంతో, రేణిగుంట రోడ్డులోని ఏకాంతే బ్లిస్ హోటల్ నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూకివాకం మురుగు ఫిల్టర్ ట్యాంక్ వరకు ఈ పైప్‌లైన్‌ను పూర్తిగా మార్చాల్సి ఉంది. రాబోయే 50 ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.​ఈ కొత్త పైప్‌లైన్ ఏర్పాటు ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి (STP), మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలకు కిలో లీటరు రూ. 3 నుంచి రూ. 5 చొప్పున విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లోని పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా శుద్ధి చేసిన నీటిని అందించవచ్చు. ఒకవేళ పరిశ్రమలు వాడుకోకపోతే, ఈ నీటిని రైతులు పంటల సాగుకు ఉపయోగించుకునే వీలుంటుంది.​ఇప్పటివరకు పర్సెంటేజీల పేరుతో కాలయాపన చేసినా, ఇప్పుడు అధికారులు ఎన్నికల బిజీ సాకుతో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేటాయించిన నిధులను ఇలా మురుగుపాలు చేస్తూ, ప్రజలను నిత్య నరకయాతనకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి 

 సూర్య స్టేట్ క్రైమ్ బ్యూరో