20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు
మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని షేక్ షబానా,21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.ఏ కరిముల్లా చైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతిల గెలుపు కోసం నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు.మదనపల్లె పట్టణం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీతో సాధ్యమని ప్రజలకు వివరించారు.పట్టణ సమగ్రాభివృద్ధికి వైయస్సార్సీపీని బలపరచాల్సిందిగా కోరారు.ఈ సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికి మద్దతు తెలిపారు.గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.సంక్షేమ పథకాలను నిర్విరామంగా ప్రజలకు అందించి వారి మనసును గెలుచుకున్న నాయకుడు మాజీ సీఎం జగనన్నని కొనియాడారు.మళ్లీ ప్రజల జీవితాల్లో వెలుగులు ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి వైఎస్ఆర్సిపిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి జింకా చలపతి,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి,అనూషా రెడ్డి,ముబాషీర్ అహమ్మద్,ఇర్ఫాన్ షేక్,రఫీ,యూనస్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి