సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ‘హెనోక్’ ఫస్ట్ లుక్ విడుదల
మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ నటిస్తున్న తాజా సినిమా ‘హెనోక్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో దిలీప్ 'డాక్టర్ లీయో థామస్' అనే ఫోరెన్సిక్ సర్జన్ పాత్రలో కనిపించనున్నారు. 'పుష్పక విమానం' చిత్రంతో గుర్తింపు పొందిన ఉల్లాస్ కృష్ణ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా కథ ఒక రహస్యమైన సంఘటన, దాని చుట్టూ సాగే దర్యాప్తు నేపథ్యంలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ప్రతీ ఆధారం కొత్త ప్రశ్నలకు దారితీస్తూ, న్యాయం కోసం సాగే పోరాటం చుట్టూ ఈ విచిత్ర కథాంశం తిరుగుతుంది. ఈ చిత్రంలో జోనీ ఆంటోనీ, అర్జున్ రాధాకృష్ణన్, గ్రేస్ ఆంటోనీ, ముకేష్, జగదీష్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఎం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ సంస్థ పంపిణీ చేయనుంది. షాజీ కుమార్ ఛాయాగ్రహణం వహిస్తుండగా, ముజీబ్ మజీద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల ఆలప్పుళాలో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాపై ప్రేక్షకులలోనూ, అభిమానులలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.