BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

సూర్య ‘సీన్’ చిత్రంపై జీతూ మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
సూర్య ‘సీన్’ చిత్రంపై జీతూ మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మలయాళ దర్శకుడు జీతూ మాధవన్, తమిళ కథానాయకుడు సూర్య కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘సీన్’. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు జీతూ మాధవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మొదట ఈ కథను సూర్య కంటే ముందే ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్‌తో తెరకెక్కించాలని భావించినట్లు ఆయన వెల్లడించారు.

ఫహాద్ ఫాసిల్, నజ్రియా నాజిమ్ జంటగా మలయాళంలో ఈ సినిమాను నిర్మించాలని ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. జీతూ మాధవన్ కథ చెప్పగానే ఫహాద్‌కి ఎంతో నచ్చింది, ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు, ఆ తర్వాత ఈ కథను తమిళంలో సూర్యతో నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు నజ్రియా నాజిమ్, నస్లేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆవేశం’ వంటి భారీ విజయం తర్వాత జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ వినోదాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది. సూర్య-జీతూ మాధవన్ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి వినోదాన్ని పంచుతుందోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.