BREAKING
మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి 57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి 36వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం టిడిపిని గెలిపించండి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్**హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం* - *కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ* పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం గ్రామాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత నాగాయలంకలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మండలి అంచనాలను అందుకున్న యుబీఎస్...మూడో త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల నికర లాభం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..ఎక్వినార్ కంపెనీ లాభాల్లో భారీ జంప్ బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు

ఆటో స్టీరింగ్‌ నుంచి.. రాజకీయ పగ్గాల వరకు ముత్తుకూరు ఎంపీటీసీగా ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
ఆటో స్టీరింగ్‌ నుంచి.. రాజకీయ పగ్గాల వరకు ముత్తుకూరు ఎంపీటీసీగా ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

ఆటో స్టీరింగ్‌ నుంచి.. రాజకీయ పగ్గాల వరకు ముత్తుకూరు ఎంపీటీసీగా ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

అట్లూరు, మేజర్ న్యూస్:
పేద కుటుంబం నుంచి ప్రజా ప్రతినిధిగా ఎదిగిన సామాన్యుడు 
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి.. ఆటో డ్రైవర్ నుంచి ప్రజాసేవకుడిగా ప్రస్థానం
కడప జిల్లా అట్లూరు మండలంలో ఓ ఆటో డ్రైవర్ జీవితంలో కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు ముత్తుకూరు గ్రామానికి చెందిన ప్రసాద్. కుటుంబ పోషణ కోసం ఒకప్పుడు గల్ఫ్‌ దేశాలకు వెళ్లి పనిచేసిన ఆయన.. ఆ తర్వాత స్వగ్రామంలో ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎదిగారు. ముత్తుకూరు ఎంపీటీసీ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరలేచింది.

సామాన్యుడి నుంచి ప్రజాప్రతినిధిగా..

పేద కుటుంబంలో జన్మించిన ప్రసాద్‌ జీవన ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన ఆయన, అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చి ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి జీవన పరిస్థితులను దగ్గరగా గమనించిన ఆయనకు ఇప్పుడు ప్రజాసేవ చేసే అవకాశం లభించింది.

ఏకగ్రీవ ఎన్నికతో కొత్త అధ్యాయం

ముత్తుకూరు ఎంపీటీసీ స్థానం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసాద్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధిగా సేవలందించే అవకాశం దక్కింది. ఈ పరిణామంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

ఆటో డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసాద్‌కు అవగాహన ఉంది. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు అవసరమైన వసతుల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు.

సామాన్యుడి ఎదుగుదలకు నిదర్శనం

రాజకీయాల్లో ప్రజలతో మమేకమై పనిచేసే వారికి అవకాశాలు లభిస్తే సామాన్యులు సైతం ప్రజాప్రతినిధులుగా ఎదగగలరనే విషయానికి ప్రసాద్‌ ప్రస్థానం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆటో స్టీరింగ్‌ పట్టిన చేతులు ఇప్పుడు ప్రజాసేవ బాధ్యతలు చేపట్టనున్నాయి. ఆయన ఏకగ్రీవ ఎన్నికతో ముత్తుకూరు గ్రామంలో కొత్త ఆశలు చిగురించగా ప్రజాప్రతినిధిగా ప్రసాద్‌ ఎలాంటి సేవలందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్: ఎ. తిరుపాల్, అట్లూరు