BREAKING
యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం భారత టెక్‌ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి ఆకాశ్ అంబానీ త్రైమాసిక లాభాల్లో అంచనాలను తలకిందులు చేసిన ఎస్ఎస్‌ఏబీ ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ! అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విక్రయాల అంచనాలను తగ్గించిన జెనరిక్ దిగ్గజం శాండోజ్ వార్షిక అంచనాలను పెంచిన డెలివరీ హీరో పెరుగుతున్న ధరల జోరుతో డానిన్ మూడో త్రైమాసిక విక్రయాలు వృద్ధి శాంటాండర్ అఖండ విజయం ఏసీ కూరగాయల మార్కెట్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ విస్తృత ప్రచారం రెమి కొయింట్రో అంచనాలను మించిన త్రైమాసిక విక్రయాలు గ్లోబల్ విద్యుత్ మార్కెట్లలో పట్టు కోల్పోతున్న సహజ వాయువు క్లిష్టమైన ఖనిజాల శుద్ధి పెంపునకు పెట్టుబడుల రక్షణే కీలకం ఆర్నబ్‌ తుపాను బీభత్సం.. ఏపీలో ఇద్దరు మృతి, వందల విద్యుత్ స్తంభాలు నేలమట్టం చైనా ఏఐ ల్యాబ్స్‌కు ఆశాకిరణం...అంతర్జాతీయ ఏఐ విధానాలపై సంచలన విశ్లేషణ

బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు

Select Suryaa Now
బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు

సూర్య కరీంనగర్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిమ మెడికల్ కాలేజీ (పిమ్స్), కరీంనగర్ అబ్స్ట్రేటిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ (కేఓజీఎస్) సహకారంతో అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా బుధవారం ఐఎంఏ హాల్‌లో కరీంనగర్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కటారి, గౌరవ కార్యదర్శి డాక్టర్ చల్లూరి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఆడెపు మానస పాల్గొని బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలు, వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు నిర్వహించాల్సిన పరీక్షలపై అవగాహన కల్పించారు. 

ప్రతిమ జనరల్ సర్జన్ డాక్టర్ గీతారెడ్డి వీడియో ద్వారా స్వీయ రొమ్ము పరీక్ష (సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్) చేసుకునే విధానాన్ని వివరించారు. కేఓజీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ కవిత, కార్యదర్శి డాక్టర్ పూర్ణిమ, కోశాధికారి డాక్టర్ శృతి, డాక్టర్ స్రవంతి, ప్రతిమ వైద్య కళాశాల పీజీ వైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళా సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా స్కానింగ్ పరీక్షలు చేశారు. పరీక్షల్లో క్యాన్సర్‌కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే తదుపరి నిర్ధారణ కోసం మమ్మోగ్రామ్ పరీక్షలను కూడా ప్రతిమ ఆసుపత్రిలో రాయితీ ధరలకు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని, మహిళలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.