BREAKING
మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ

జవహర్‌నగర్‌ డంప్‌యార్డు తరలింపునకు పోరుబాట.. రెండో రోజు ఈటల రాజేందర్‌ పాదయాత్ర

Select Suryaa Now
జవహర్‌నగర్‌ డంప్‌యార్డు తరలింపునకు పోరుబాట.. రెండో రోజు ఈటల రాజేందర్‌ పాదయాత్ర

ఘట్‌కేసర్‌, మేజర్‌ న్యూస్‌: జవహర్‌నగర్‌ డంప్‌యార్డును తరలించాలనే ప్రధాన డిమాండ్‌తో ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ నాయకులు చేపట్టిన 60 కిలోమీటర్ల పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పాదయాత్రను బుధవారం అన్నోజిగూడలో ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ వరకు యాత్ర సాగింది.జవహర్‌నగర్‌ డంప్‌యార్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, దాని తరలింపునకు ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టారు. డంప్‌యార్డు తరలింపు డిమాండ్‌తో నాలుగు రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి తమ నిరసనను తెలియజేయనున్నారు. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకురాలు బోడిగ శోభ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేశ్‌ చారి తదితరులు పాల్గొన్నారు.