గ్రామాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నవాబుపేట సూర్య న్యూస్:మండల పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది.ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రేకుల చౌడాపూర్,లోకిరేవు,లింగంపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.అలాగే అమ్మాపూర్,మొరంబాయి,జంగమయ్యపల్లి,చౌడూర్,దేపల్లి,కొల్లూరు,కేశవరావుపల్లి,పోమాల్,కామారం,గురుకుంట గ్రామాల్లోనూ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సేవలు మరింత సులభంగా అందనున్నాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం,కాంగ్రెస్ పార్టీ నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.