BREAKING
ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం.

అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో  కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   జిల్లాకు అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక ఉన్నందున  ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఈ మేరకు   ఒక ప్రకటన విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు,తీరా ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే  ముందస్తుగా ఏర్పాట్లు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు. నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, పీఆర్, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు 24/7 అప్రమత్తంగా ఉంటూ..తగు ముందస్తు  చర్యలు చేపట్టాలన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు : భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861- 2331261, 79955 76699 నెంబర్ కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.  కంట్రోలు రూంలో 24 గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.