BREAKING
యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం భారత టెక్‌ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి ఆకాశ్ అంబానీ త్రైమాసిక లాభాల్లో అంచనాలను తలకిందులు చేసిన ఎస్ఎస్‌ఏబీ ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ! అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విక్రయాల అంచనాలను తగ్గించిన జెనరిక్ దిగ్గజం శాండోజ్ వార్షిక అంచనాలను పెంచిన డెలివరీ హీరో పెరుగుతున్న ధరల జోరుతో డానిన్ మూడో త్రైమాసిక విక్రయాలు వృద్ధి శాంటాండర్ అఖండ విజయం ఏసీ కూరగాయల మార్కెట్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ విస్తృత ప్రచారం రెమి కొయింట్రో అంచనాలను మించిన త్రైమాసిక విక్రయాలు గ్లోబల్ విద్యుత్ మార్కెట్లలో పట్టు కోల్పోతున్న సహజ వాయువు క్లిష్టమైన ఖనిజాల శుద్ధి పెంపునకు పెట్టుబడుల రక్షణే కీలకం ఆర్నబ్‌ తుపాను బీభత్సం.. ఏపీలో ఇద్దరు మృతి, వందల విద్యుత్ స్తంభాలు నేలమట్టం చైనా ఏఐ ల్యాబ్స్‌కు ఆశాకిరణం...అంతర్జాతీయ ఏఐ విధానాలపై సంచలన విశ్లేషణ

నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

Select Suryaa Now
నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు


కందుకూరు: బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వకపోయినా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్‌తో పాటు యూత్ నాయకులు బొక్క దీక్షిత్ రెడ్డి, కుమ్మరి నరేష్, రావిచెట్టు అరుణ్ కుమార్, కుమ్మరి మధుకర్‌లను కందుకూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….అరెస్టులకు భయపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ, సబితమ్మ ఆదేశాల మేరకు కందుకూరు మండలంలో మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాలు లేని సమయంలో ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని విమర్శించారు. ప్రజల గొంతుకను అణచివేయకుండా ప్రశ్నించే హక్కును గౌరవించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్