ఏసీ కూరగాయల మార్కెట్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ విస్తృత ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనీ 52వ డివిజన్, ఏ.సీ. కూరగాయల మార్కెట్ ఎన్నికల ప్రచారంలో నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి తో కలసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ , అలాగే 52వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పున్నపు విష్ణుప్రియ ని అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మాజీ మేయర్ భాను శ్రీ, 52వ డివిజన్ టిడిపి అభ్యర్థి పున్నపు విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు