నాగాయలంకలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మండలి
అవనిగడ్డ మేజర్ న్యూస్: ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం పరిశీలించారు. శిబిరంలో ఆశ్రయం పొందుతున్న తుఫాన్ బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.బాధితులకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, వైద్య సేవలను పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఎవరూ ఇళ్లకు వెళ్లవద్దని సూచించారు. బాధితులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలని, శిబిరం పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, శిబిరంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. ✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.