పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం
పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం.
మాచర్ల మేజర్ న్యూస్:
పదవుల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండల పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఎంపీపీ పదవిని ఆశించినప్పటికీ, కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి గౌరవం ఇస్తూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత ఆశయాలకు అనుగుణంగా, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ అభివృద్ధి, పార్టీ నిర్ణయాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పదవి దక్కకపోయినా పార్టీ పట్ల తన అంకితభావం ఏమాత్రం తగ్గదని, మునుపటిలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి అభిమానాన్ని, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం తన పోరాటం కొనసాగుతుందని, కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
సీనియర్ రిపోర్టర్ తవిటి శ్రీకాంత్.