‘రామాయణ’లో ఏఐ వాడకం పై నితీష్ తివారీ స్పష్టత
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రం ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనలో దర్శకుడు నితీష్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలో కృత్రిమ మేధ వాడకంపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ, డబ్బింగ్ కోసం ఎలాంటి కృత్రిమ మేధను ఉపయోగించలేదని స్పష్టం చేశారు. చిత్రం లోని అన్ని పాత్రల సంభాషణలను నిజమైన నటులే స్వయంగా డబ్బింగ్ చెప్పారని ఆయన వెల్లడించారు.
వివిధ భాషల ప్రేక్షకులకు సినిమా సహజంగా అనిపించేలా పెదవుల కదలికలను సరిచేసేందుకు మాత్రమే ఈ సాంకేతికతను ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. వివిధ భాషల్లో విడుదలయ్యే సమయంలో మాటలకు, నటుల పెదవుల కదలికలకు మధ్య సమన్వయం కోసం మాత్రమే ఈ మార్పులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు తమ సొంత భాషలో సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించగలరని చెప్పారు.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.