కాంగ్రెస్ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించండి
మంచాల, మేజర్ న్యూస్ : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ విషయాలను పట్టభద్రులకు వివరించాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనపర్తి భద్రీనాథ్ గుప్తా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలోని సత్తి తండలో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో భద్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటరు నమోదుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు లాలు నాయక్, కొర్ర సాగర్ నాయక్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల.