58వ డివిజన్‌లో షేక్ షా అలీ హుస్సేన్ ప్రచారం.. ప్రజాసేవే లక్ష్యంగా మరోసారి బరిలోకి!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) బలపరిచిన 58వ డివిజన్ అభ్యర్థి షేక్ షా అలీ హుస్సేన్ మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. చదువుకున్న వ్యక్తిగా, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పాటు కోవిడ్ సమయంలో అందించిన సేవలు, గతంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలనే నమ్మకంతో, తన ఎన్నికల గుర్తు ఏసీ (ఎయిర్ కండిషనర్) పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను అర్థం చేసుకుని సేవ చేయాలనే లక్ష్యంతో షేక్ షా అలీ హుస్సేన్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత అనుభవాన్ని, ప్రజలకు చేసిన సేవలను గుర్తించి తనకు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. అలాగే ఎస్‌డీపీఐ బలపరిచిన నెల్లూరు మేయర్ అభ్యర్థి అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ కుట్టు మిషన్ గుర్తు పై పోటీ చేస్తున్నారు. 58వ డివిజన్ అభ్యర్థి షేక్ షా అలీ హుస్సేన్‌కు ఏసీ గుర్తుపై, మేయర్ అభ్యర్థి సయ్యద్ కాషిఫ్‌కు కుట్టు మిషన్ గుర్తుపై ఓటు వేసి ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.