ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్‌పై వివాదం - నెతాజీ మనవడి అభ్యంతరం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఫౌజీ’ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను చూపించిన తీరుపై తీవ్ర వివాదం చెలరేగింది. చరిత్రను వక్రీకరిస్తూ జాతీయ నాయకులను తక్కువ చేసి చూపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడైన చంద్ర కుమార్ బోస్ స్పందిస్తూ చిత్రబృందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కల్పిత కథల పేరుతో చారిత్రక నిజాలను మార్చడం నేరమని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ టీజర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించి, తప్పులను సరిదిద్దిన తర్వాతే కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఒక చారిత్రక వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది.