BREAKING
70వ SGF కబడ్డీ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి 57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి 36వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం టిడిపిని గెలిపించండి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్**హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం* - *కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ* పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం గ్రామాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత నాగాయలంకలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మండలి అంచనాలను అందుకున్న యుబీఎస్...మూడో త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల నికర లాభం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..ఎక్వినార్ కంపెనీ లాభాల్లో భారీ జంప్ బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

ఆన్‌లైన్ గేమ్స్‌ వద్దురా.. అమ్మానాన్న మాట ముద్దురా! యువతకు మానకొండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి పిలుపు

Select Suryaa Now
ఆన్‌లైన్ గేమ్స్‌ వద్దురా.. అమ్మానాన్న మాట ముద్దురా! యువతకు మానకొండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి పిలుపు

సూర్య – మానకొండూర్:యువత ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తును బంగారు బాటలో నడిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.తండ్రి ఎండనక, వాననక పొలంలో కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తే, తల్లి కుటుంబ బాగోగులు చూసుకుంటూ పిల్లల అవసరాల కోసం అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు సంతోషంగా, ఉన్నతంగా జీవించాలన్నదే తల్లిదండ్రుల నిజమైన ఆకాంక్ష అని తెలిపారు.సరదాగా ప్రారంభమయ్యే ఆన్‌లైన్ గేమ్స్‌ క్రమంగా వ్యసనంగా మారి, యువత విలువైన సమయాన్ని, డబ్బును హరించడంతో పాటు వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకుని జీవితంలో స్థిరపడాలని చెప్పే తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి, కొందరు యువకులు అప్పులపాలై తప్పుదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆన్‌లైన్ గేమింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలతో క్షణికావేశంలో ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని యువతకు సూచించారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా మళ్లీ కోలుకుని విజయం సాధించవచ్చని, ప్రాణాలు కోల్పోతే తిరిగి పొందలేమని గుర్తుచేశారు. పిల్లలకు ఏ సమస్య ఎదురైనా అమ్మానాన్నలతో, నమ్మకమైన పెద్దలతో మనసు విప్పి మాట్లాడాలని, ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై తగిన పర్యవేక్షణ ఉంచాలని, వారిని కేవలం మందలించకుండా క్రీడలు, వ్యాయామం, పుస్తక పఠనం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆన్‌లైన్ గేమింగ్ దుష్ప్రభావాలపై ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, సామాజిక సంస్థలు యువతలో విస్తృత అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గేమ్స్‌లో కాదు.. నిజ జీవితంలో విజేతలుగా నిలవాలి! తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి! అని ద్యావ శ్రీనివాస్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు.