తైవాన్ ఆరోపణలను ఖండించిన చైనా
సూర్య అంతర్జాతీయ డెస్క్: తైవాన్‌లో ప్రముఖ స్టాండప్ కమెడియన్‌పై జరిగిన దాడి వెనుక చైనా ప్రమేయం ఉందంటూ తైవాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను బీజింగ్ సర్కార్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ లబ్ధి కోసమే తైవాన్ అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తైవాన్ జాతీయ భద్రతా సంస్థలు చేస్తున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చింది.
తైవాన్‌కు చెందిన ఓ ప్రముఖ కమెడియన్ ఇటీవల అజ్ఞాత వ్యక్తుల దాడికి గురవడం ఆ దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. చైనాను విమర్శిస్తూ ప్రదర్శనలు ఇస్తున్నందుకే ఆయనపై ఈ దాడి జరిగిందని, దీని వెనుక బీజింగ్ హస్తం ఉందని తైవాన్ నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.
స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్‌ను తమ దేశంలోర్భాగంగా భావించే చైనా, తైవాన్ రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఉద్దేశపూర్వకంగానే చైనాపై వ్యతిరేకతను పెంచేందుకు తైవాన్ ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని బీజింగ్ ఆరోపించింది. ఈ ఘటనతో తైవాన్ స్ట్రైట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.