BREAKING
మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి 57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి 36వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం టిడిపిని గెలిపించండి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్**హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం* - *కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ* పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం గ్రామాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత నాగాయలంకలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మండలి అంచనాలను అందుకున్న యుబీఎస్...మూడో త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల నికర లాభం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..ఎక్వినార్ కంపెనీ లాభాల్లో భారీ జంప్ బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు

రాత్రంతా చీకట్లోనే కోనసీమ జిల్లా.. స్తంభించిన విద్యుత్, రవాణా వ్యవస్థలు

Select Suryaa Now
రాత్రంతా చీకట్లోనే కోనసీమ జిల్లా.. స్తంభించిన విద్యుత్, రవాణా వ్యవస్థలు

అమలాపురం, మేజర్ న్యూస్ :‘అర్నబ్’ పెను తుఫాను ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం విరుచుకుపడటంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర విపత్తు వాతావరణం నెలకొంది.

భారీ ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు ప్రధాన విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచే జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, రాత్రంతా కోనసీమ ప్రాంతం అంధకారంలోనే గడిపింది.

మరోవైపు, రోడ్లకు అడ్డంగా భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పలు మార్గాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు, పోలీసు సహాయక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఆధునిక కట్టర్ల సహాయంతో రహదారులపై పడిన చెట్లను తొలగిస్తూ రవాణాను పునరుద్ధరించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. గాలుల ఉధృతి తగ్గిన వెంటనే యుద్దప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు.