BREAKING
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..ఎక్వినార్ కంపెనీ లాభాల్లో భారీ జంప్ బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం ‘ఫ్యాన్ గుర్తు’కు ఓటు వేసి గెలిపించండి.. అనంత వెంకటరామిరెడ్డి బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు తుఫాన్ బీభత్సం.. అంధకారంలో దివిసీమ ఎడతెరిపిలేని వర్షంతో జలమయమైన రహదారులు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత.. ప్రజలకు తప్పని ఇబ్బందులు వైభవంగా గ్లోబల్ సెన్స్ కార్యక్రమం ప్రారంభం రత్నగిరి ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లో రికార్డు పెట్టుబడి విదేశీ మార్కెట్ల వైపు భారతీయుల మొగ్గు మలేషియా విమానాశ్రయంలో కోట్ల విలువైన ఏఐ చిప్స్ సీజ్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ కాంగ్రెస్ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించండి ఏపీ తీరాన్ని దాటిన ఆర్నబ్ తుపాను.. క్రమంగా బలహీనం రియో టింటో సీఈఓ వేతనంలో ఏకంగా 56 శాతం పెంపునకు ప్రతిపాదన

విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పోషకాహారం ఎంతో ముఖ్యం: కార్పొరేటర్ ఆకుల నర్మద

Select Suryaa Now
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పోషకాహారం ఎంతో ముఖ్యం: కార్పొరేటర్ ఆకుల నర్మద

సూర్య కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని గౌతమ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటూ చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ వాజిద్, ఉపాధ్యాయులు తేజ తదితరులు పాల్గొన్నారు.