ఎన్నికల నిర్వహణలో పీఓలదే కీలక పాత్ర
బాడంగి, అక్టోబరు 26 (మేజర్ న్యూస్): ఈ నెల 3న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక బాధ్యతని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. మహారాజన్ అన్నారు.
సోమవారం బాడంగి ఎంపీడీవో కార్యాలయంలో పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన, సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో డీవీ శ్రీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాజన్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, ప్రత్యేక కవర్లు, చట్టబద్ధమైన, చట్టబద్ధం కాని కవర్ల వినియోగం, ఎన్నికల పత్రాల భర్తీపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.