రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు
విజయనగరం మేజర్ న్యూస్
విజయనగరం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేడు అత్యంత వైభవంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ సిరిమానోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్షం ఉన్నా ఉత్సవం ఘనంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందన్నారు.
ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుఫాన్ కారణంగా సిరిమానును ముందుగానే ప్రారంభించి భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు
భక్తుల దర్శన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం