కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం -
కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం
- టిడిపి హయంలోనే కోడుమూరుకు శాశ్వత తాగుననీటి పరిష్కారం చూపుతాం
- కోడుమూరులో అన్ని స్థానాలను గెలుచుకుంటాం
కోడుమూరు మేజర్ న్యూస్:
కోడుమూరు మండల అభివృద్ధి చెందాలంటే టిడిపి ప్రభుత్వం తోనే అది సాధ్యమవుతుందని టిడిపి మండల కన్వీనర్ అనుగొండ రామకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయుడులు పేర్కొన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపిటిసిలుగా పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం-అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారన్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇవ్వని ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. కోడుమూరు మండలంలో రెండున్నర ఏళ్లలో దాదాపు 6 కోట్లలో సిమెంట్ రోడ్లను వేశామని అలాగే కొత్తపల్లి-గోరంట్ల బీటి రోడ్డు,కోడుమూరు పట్టణంలో కోటి రూపాయలతో మోడల్ స్కూలుకు సిసి రోడ్డు నిర్మాణం,పట్టణంలో బుడగ జంగాల కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని భవిష్యత్తులో కూడా చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలంటే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే నిధులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్లప్ప నాయుడు,బ్రిటిష్ రాముడు,బడేసా గౌడ్, చేనేత భాస్కర్,కురువ రాముడు, రవి, కెంచుగుండు నాగేష్, దావూద్, మధు,ఇంతియాజ్,నిహార్ తదితరులు పాల్గొన్నారు.