BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో దర్శన వేళల్లో మార్పులు

Select Suryaa Now
లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో దర్శన వేళల్లో మార్పులు
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రి గుట్టపై నవంబర్ 15 నుంచి 26 వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లలో మార్పులు చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు.
*ధ్వజారోహణం రోజున దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం*
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 17న నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారి దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి సంపూర్ణ అలంకార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
*నాలుగు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు*
నవంబర్ 19, 24, 25, 26 తేదీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.భక్తుల రద్దీ నియంత్రణ, తొక్కిసలాట నివారణకు ఆలయ యంత్రాంగం చేపట్టే చర్యలకు భక్తులు సహకరించాలని నంబి పార్థసారథి కోరారు. బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.