BREAKING
మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ఓటుతో రాజేశ్వరిని గెలిపించండి నార్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా పి. శ్రుతి ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ఆశీర్వదించండి అభివృద్ధికి అండగా నిలుస్తాం క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు

క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి

Select Suryaa Now
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని అర్హత కలిగిన చర్చిలకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. చర్చిలకు వైట్‌వాష్ చేయడం, విద్యుత్ దీపాలంకరణ చేపట్టడం కోసం తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని అర్హత కలిగిన చర్చిల కమిటీలు ఆర్థిక సహాయం పొందేందుకు నవంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు OBMMS వెబ్‌సైట్ (https://tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తిప్పన విజయేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు.

డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దరఖాస్తు ప్రతితో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి నల్గొండ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ఈ అవకాశాన్ని అర్హత కలిగిన చర్చిల కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, పాస్టర్లు సద్వినియోగం చేసుకోవాలని, చివరి తేదీ వరకు వేచి చూడకుండా గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. విజయేందర్ రెడ్డి కోరారు.