BREAKING
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ. ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్

ఝ‌రాసంగం;కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయానికి చేరుకున్న ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం ఝరాసంగం మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు పటేల్, న్యాల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు నవాజ్ రెడ్డి, బీఎస్ వీర్ శెట్టి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.