BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం

కోటనందూరు, మేజర్ న్యూస్ : కోటనందూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా తన వార్డు సభ్యులతో కలిసి ప్రతి గడపకు వెళ్తూ గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి అక్కచెల్లెమ్మలను, అవ్వలను, నాయనమ్మలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను మీ సేవకుడిగా ఆదరించండి. కోటనందూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా అని హామీ ఇస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తింపు పొందిన కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచానని, తనతో పాటు తన వార్డు సభ్యులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి తాను చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.

వెలగా వెంకటకృష్ణారావుకు మద్దతుగా ప్రచారంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు.