BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

Select Suryaa Now
టీటీడీ స్థానిక ఆలయాల్లో  కార్తీక దీపోత్సవం

తిరుపతి సూర్య బ్యూరో :

టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాల్లో మంగళవారం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలన్నీ దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించి భక్తులకు దైవదర్శన భాగ్యం కల్పించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
----------
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
-----------
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామాలయంలో
---------
శ్రీ కోదండరామాలయంలో రాత్రి 8 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి కార్తీక దీపోత్సవ ఆస్థానం నిర్వహించారు.

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో
------------
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
---------
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు
---------
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,