చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు
చిట్టమూరు మేజర్ న్యూస్
తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి,వివిధ హోదాల్లో క్రియాశీలకంగా పనిచేసిన పఠాన్ బషీర్ ఖాన్ చిట్టమూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకుల సహకారంతో చిట్టమూరు సర్పంచ్ స్థానంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగడం విశేషం. పఠాన్ బషీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.గతంలో మండల యువత అధ్యక్షుడిగా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా తదితర బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ,పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. మండల పార్టీ కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడుతో సన్నిహితంగా ఉంటూ, ఆయనకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. మండలంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు.మండల కేంద్రమైన చిట్టమూరుకు వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందించేవారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ స్థానికంగా మంచి గుర్తింపు పొందారు.మైనారిటీ వర్గానికి చెందిన యువ నాయకుడిగా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానికంగా ఆ వర్గ ప్రజలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న పఠాన్ బషీర్ ఖాన్ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు, సహచరులు ఆయనకు శుభాకాంక్షలు,అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్