BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం

Select Suryaa Now
కార్తిక శోభ'-  * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాసం చివరి పౌర్ణమి కావడంతో భక్తులు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. గుట్టపైకి వాహనాలను అనుమతించకుండా నియంత్రించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో చెరువుగట్టు పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.