నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు
నగరం, మేజర్ న్యూస్: సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల్లో 120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఉన్నట్లు ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు తెలిపారు. సర్పంచ్ పదవికి 21 మంది వార్డు సభ్యులకు ఆరుగురు తొలగించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. రెండు సీట్లు వంతున నామినేషన్లు వేసిన వాటిలో రద్దు చేసిన వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పమిడిమర్రు పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, అల్లపర్రు పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఉల్లిపాలెం పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, నామినేషన్లు ఉన్నాయి.
మీసాలవారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, చినమట్లపూడి పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, ఒక వార్డు సభ్యులకు,
ధూళిపూడి సౌత్ పంచాయతీలో ఒక సర్పంచ్ కి నామినేషన్లు ఉన్నాయి. వెనిగళ్ళవారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, కొలగానివారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, ధూళిపూడి నార్త్ పంచాయితీలో ఒకరు సర్పంచికి, మంత్రిపాలెం పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, 4 గురు వార్డు సభ్యులకు, సిరిపూడి పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, తోటపల్లి పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, బెల్లంవారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, ఏలేటిపాలెం పంచాయితీలో ఇద్దరు సర్పంచికి, ఒకరు వార్డు సభ్యులుగా ఉన్నారు.