విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు
నగరం, మేజర్ న్యూస్: నగరం మండలంలోని కొన్ని గ్రామాల రైతులను వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) గుంటూరు వారి ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్రలో భాగంగా బాపట్లలోని అఖిల భారత సమన్వయ కోత అనంతరం సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన కేంద్రానికి మంగళవారం ఇంచార్జీ రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు
రైతులను తీసుకు వెళ్లారు. ప్రధాన శాస్త్రవేత్త అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ వెస్టింగ్ టెక్నాలజీ హెడ్ డాక్టర్ డి.డి స్మిత్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వరి కోతనంతరం ఉపయోగించే పరికరాలైన మినీ రైస్ మిల్, వరి పిండి మిషన్, మినుములు గుళ్ళు తీసే మిషన్, దాల్ మిల్, వేరుశెనగ ఆయిల్ తీసే మిషన్ మొదలగు పరికరాలు, వాటి ఉపయోగం గురించి రైతులకు తెలియ జేశారు. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ డి. సందీప్ రాజా శాస్త్రవేత్త బయో కెమిస్ట్రీ, డాక్టర్ జి. వీర ప్రసాద్ ప్రిన్సిపల్, ఇన్వెస్టిగేటర్ హెడ్ ఫామ్ మిషనరీ, డాక్టర్ వి. వాసుదేవరావు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు తమ విభాగాలలో జరిగే వివిధ రకాల మిషన్లు వాటి పనితనం రైతుకి ఎలా ఉపయోగపడుతుందో, పంట పండిన తర్వాత ఎలాంటి విలువలు జోడించవచ్చో, మార్కెట్ కనుగుణంగా తయారుచేసి నిల్వ చేసుకొనే విషయాలపై రైతులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం యంత్ర పరికరాల డెమో రైతులకు చూపారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.