BREAKING
మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ఓటుతో రాజేశ్వరిని గెలిపించండి నార్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా పి. శ్రుతి ఏడు పంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ఆశీర్వదించండి అభివృద్ధికి అండగా నిలుస్తాం క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు

తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

Select Suryaa Now
తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో వెలిగిన దీపాల శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.

కార్తీక పున్నమి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు టీటీడీ ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం ముందుగా ఆలయంలోని శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి పక్కన ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో నేతి దీపాలను వెలిగించారు. అనంతరం ఆ దీపాలను ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలోని శ్రీవారికి హారతి సమర్పించారు.

తదుపరి వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతటా సుమారు వెయ్యి నేతి జ్యోతులను వెలిగించారు. గర్భాలయంలోని అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత సన్నిధి, బంగారు బావి, కల్యాణ మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, వెండి వాకిలి, మహాద్వారంతో పాటు బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయాలు, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను అలంకరించడంతో తిరుమల గిరి దివ్యకాంతులతో వెలిగిపోయింది. కాగా, కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ మంగళవారం నాటి పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.