BREAKING
మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ. ఓటుతో అవకాశం ఇవ్వండి.. పనితీరుతో నమ్మకం నిలబెడతా జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో గూడెం విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు మీ ఓటుతో నన్ను గెలిపించండి జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన

మీ ఓటుతో రాజేశ్వరిని గెలిపించండి

Select Suryaa Now
మీ ఓటుతో రాజేశ్వరిని గెలిపించండి

- కత్తెర గుర్తుకు ఓటేయాలని దారపనేని చంద్రశేఖర్ విజ్ఞప్తి

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని  తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ సమగ్ర అభివృద్ధికి మానం రాజేశ్వరికి అవకాశం కల్పించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మానం రాజేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం  పంచాయతీ పరిధిలోని తూర్పు కోడిగుడ్లపాడు, జంగాలపల్లి, పోతవరం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ వారితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి మానం రాజేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అభ్యర్థికి ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పనిచేసే నాయకత్వానికి అవకాశం కల్పించాలని కోరారు. రాజేశ్వరికి మీ అమూల్యమైన ఓటుతో పాటు ఆశీస్సులు అందించి ఘన విజయాన్ని కట్టబెట్టాలని చంద్రశేఖర్ ఓటర్లను అభ్యర్థించారు.ప్రచారంలో పంచాయతీ వార్డు అభ్యర్థులు అద్దంకి మాల్యాద్రి, పోతయ్య, దారపనేని అన్నపూర్ణ, తాతపూడి ఏసేబు, తాళ్లూరి జయరావు, మానం రమణమ్మ, మనం నాగేంద్ర, ఇర్ల ఉమా, చెనిగల భాగ్యమ్మ, తాతపూడి మేరీ, నాయకులు దారాపనేని కృష్ణ, దారపనేని రాజేంద్రప్రసాద్, మానం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.