*కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం*
కోహీర్;సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట గ్రామంలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ రాచణ్ణ స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.సాయంత్రం మహానంది మండపం వద్ద కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు దీపారాధన నిర్వహించడంతో పాటు ఆకాశ దీపాన్ని వెలిగించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.