మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర
కొండాపూర్;మండల పరిధిలోని తోగర్ పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ గౌడ్ మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. స్నేహితులు, గ్రామస్తులతో కలిసి తోగర్పల్లి నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన సతీమణి దివ్యవాణి సర్పంచ్‌గా గెలుపొందితే గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ మొక్కును తీర్చుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. తన పాదయాత్రకు సహకరిస్తున్న వారితో పాటు గ్రామ, మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించనున్నట్లు వెల్లడించారు