BREAKING
శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి*

వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు

Select Suryaa Now
వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్:

నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేదగిరి క్షేత్రముగా వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు మంగళ వారము నాడు కార్తీక పౌర్ణమి విశేష పర్వదినం సందర్భంగా ఉదయము 8 గంటలకు స్వామివారు, అమ్మవార్లు ఉత్సవవరులకు పంచామృత అభిషేకములు అర్చక స్వామి అర్చకం మాధవగిరి నరసింహ మూర్తి, సాయంత్రము 6-30 గంటలకు కార్తీక దీప జ్యోతి ప్రజ్వలన వేద మంత్రాలతో దేవస్థానము  అర్చక స్వామి అర్చకం మాధవగిరి  నరసింహ మూర్తి వైదికముగా, వైఖానస ఆగమము ప్రకారము  నెల్లూరు వాస్తవ్యులు దుగ్గి బాలాజీ, సుప్రజ ఉభయకర్తలుగా నిర్వహించారు. తదుపరి శ్రీ స్వామివారిని దేవస్థాన అర్చక స్వామి మాధవగిరి  నరసింహ మూర్తి,ముందుగా విశేషముగా చిన్న గరుడ వాహనములపై అలంకరించి చిన్న గరుడ వాహన సేవ గిరిప్రదక్షిణ మహోత్సవం ఆకురాతి ఆంజనేయ ప్రసాద్, ఇందిర దంపతులు వారి కుమారుడు సుజిత్,ఇందు దంపతులు వారి కుటుంబ సభ్యుల ఉభయకర్త్రుత్వంలో వేదం మంత్రాలు, మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, భక్తుల గోవింద నామాలు, ఆకర్షణగా బాణా సంచా మధ్య వైభవంగా నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమములో దేవస్థానము అర్చక స్వాములు మాధవగిరి అప్పలాచార్యులు, మాధవగిరి రాఘవాచార్యులు, దేవర పాలెం వాస్తవ్యులు పెనుబాక శ్రీనివాసులు రెడ్డి, యాలమూరు రంగయ్య నాయుడు, మల్లికార్జున, అనుమాలశెట్టి గిరీష్ మరియు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని, తీర్థప్రసాదములు స్వీకరించారు.