ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్.....
(కిరణ్ కుమార్ ఆరిక)
సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్ ఆధ్వర్యంలో వి.ఎం.బంజర ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్ , జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయి, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ఇంచార్జీ భూక్య వెంకటేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.ఆర్.యస్ చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. కేటీర్ ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్స్ తో ప్రభుత్వం పై చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజల్లో చర్చ జరగాలని, వారి నీచ రాజకీయాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు వేగవంతంగా కోరారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రఘమయి దయానంద్ లు చేస్తున్న ప్రజా సేవ, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గ్రామ స్థాయి కమిటీ లు, మండల స్థాయి కమిటీ లు ఏర్పాటు వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, వైరా, పాలేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిరణ్, గరిడెపల్లి కిషోర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీ బాలరాజు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి సందీప్, కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నరసింహారావు, సత్తుపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు టీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.