వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి
ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మండలం వాశిలి సర్పంచ్ గా మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాసిలి సర్పంచ్ పదవికి సుంకర పెంచల చౌదరి నామినేషన్ వేయగా ప్రత్యర్దిగా గంగా శ్రీనివాసులు నాయుడు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే వివిధ సాంకేతిక కారణాలతో గంగా శ్రీనివాస్ నాయుడు నామినేషన్ తిరస్కరణ గురైంది.దాంతో పెంచల చౌదరి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ల ఉపసంహరణ అనంతరం మంగళవారం చౌదరికి సర్పంచిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. సర్పంచిగా ఎన్నికైన చౌదరిని పలువురు తెలుగుదేశం నాయకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, శ్రేయోభిలాషులు బంధుమిత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.