మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టంలోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
నియోజకవర్గ పరిధిలో మొత్తం 135 గ్రామ పంచాయతీలు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మంగళవారం నాటికి 48 గ్రామ పంచాయతీల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రాథమిక సమాచారం.
పోలింగ్‌కు ముందే దాదాపు 40 శాతం గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామం నియోజకవర్గ స్తానిక ఎన్నికల చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆత్మకూరు మండలంలో 9, చేజర్ల మండలంలో 14, ఏ ఎస్ పేట మండలంలో 6, సంగం మండలంలో 5, అనంతసాగరం మండలంలో 6, మర్రిపాడు మండలంలో 8పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.