ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి మంగళవారం కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనo చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఉదయం 5:30కు బిందె తీర్థం, గోపూజ, స్వామి వారి అభిషేకము, అలంకారము, హారతి ఆకు పూజ జరిగినది. తదనంతరం ఉదయం 9 గంటలకు మేదరమెట్ల వాస్తవ్యులు రాజ్యసభ సభ్యుడైన ఎర్రం వెంకట సుబ్బారెడ్డి ధర్మపత్ని స్వర్ణలతా రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో స్వామివారికి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది. మేళతాళాల తోటి వినాయక స్వామి దేవాలయం, మరియు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, అలాగే ధ్వజస్తంభం వద్ద పూజా కార్యక్రమం ముగించుకొని గర్భాలయంలో స్వామి వారి వద్ద లక్ష తమల పూజా కార్యక్రమం జరిగినది. మంగళవారం రోజు కావటం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పొంగళ్ళు పెట్టుకొని ప్రదక్షిణలు చేసి స్వామివారి ముక్కుబడులు చెల్లించారు. కార్యక్రమంలో పాలకమండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు, సభ్యులు నూతి ప్రసాదు, ఏల్చూరి వెంకటనారాయణమ్మ, అరబోలు నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.