BREAKING
మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ.

అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము…

Select Suryaa Now
అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము…

సంగారెడ్డి;అన్నదానానికి మించినది లేదు అనే సంకల్పంతో సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తులకు మకర సంక్రాంతి వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి తెలిపారు.నేటి నుంచి మకర సంక్రాంతి వరకు ప్రతిరోజూ అయ్యప్ప స్వామి మాలధారులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క గురుస్వామికి, స్వాములకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ భక్తుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గురు స్వాములు జయప్రకాశ్, శ్రీశైలం, సత్యనారాయణ, విశ్వనాధ్, కమలాకర్, వెంకట్ ఇతర అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు..